Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Swarnalatha yerraballa

Comedy Romance Fantasy

4  

Swarnalatha yerraballa

Comedy Romance Fantasy

కన్నియ మనసు

కన్నియ మనసు

1 min
254


నే వరించిన వాడు రారాజాయెనా

అంబరానా నెలరాజులా నాకు చల్లని తాపం రుచి చూపేనా

నా దేవివి నీవంటూ చుక్కల తివాచీ పరిచేనా

ఈ జన్మ నీదాంటూ నన్ను రాణిలా చూసేనా


      " నే వరించిన "


రెక్కల గుర్రం ఎక్కించి చుట్టూ తిప్పేనా

రెప్పలపై ఉన్న స్వప్నాలన్నీ సంతోషంతో సొంతమాయనా

రంగు రంగుల చంద్రకిలు చెంతకు వచ్చేనా

రమ్యమైన రవళితో నా రాజును పొగుడుతూ నర్తించేనా


        "నే వరించిన "


మా జంటకు అంబుధి అలల సింహాసనం వేసేనా

మీనము మేళాళతో మాకు స్వాగతం గీతికలు పాడేనా

మధు వసంత డోలికలు కురిపించ కూర్మము రివ్వున నింగికెగెరేనా

మురిపెంగా ముత్యాల వనం ముంగిట ఉంచేనా


         "నే వరించిన "



Rate this content
Log in