STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

కొత్త ప్రణాళికలు

కొత్త ప్రణాళికలు

1 min
275

బిర్యానీలు ఎక్కువ తినకూడదు

వారానికి మూడు సార్లు తింటే చాలు

బిర్యానీ తినని రోజు పన్నీర్ తినొచ్చు

హమ్మయ్య

ఇదేదో పనికొచ్చేలా ఉంది

ఆలోచిద్దాం


బాగా నిద్రపోవాలి

తక్కువ నిద్రపోయినా లావవుతాం అట 

ఎక్కువ నిద్రపోకూడదు

ఎక్కువ నిద్రపోయినా లావవుతాం అట

అసలు నిద్రపోకూడదు

అలా చేస్తే

అమ్మో వద్దులే

బాగా నిద్రపోవాలి


అస్తమానూ సెల్ ఫోన్ చూడకూడదు

గంటకి మూడు సార్లు చూడొచ్చు

ప్రతిసారీ అరగంట చూడొచ్చు

అబ్బా 

అసలు సెల్ ఫోన్ చూడకూడదు


కొత్త సంవత్సరం ప్రణాళికలు వేసుకోవాలి

జిమ్ లో చేరాలి

జిమ్ ఇంటికి దగ్గరగా ఉండాలి

ఆదివారం జిమ్ కి వెళ్ళకూడదు

బిర్యానీ తిన్న రోజు జిమ్ కష్టం

బిర్యానీ తినని రోజు మనసు బాగోదు

ఆరోజు నిద్రపోవాలి కాబట్టి జిమ్ కష్టం

ఎక్కువ తింటే నిద్ర వస్తుంది కాబోలు

బాగా నిద్రపోవాలి

బాగా నిద్రపోవాలి


గుర్ గుర్

నిపుణుల అభిప్రాయం లేనిదే పైన పేర్కొన్నవి పాటించకూడదు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract