Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swarnalatha yerraballa

Classics Others Children

4  

Swarnalatha yerraballa

Classics Others Children

బాల్యం ---- పునాది బీజం

బాల్యం ---- పునాది బీజం

2 mins
329



కొంటెతనం,పెంకితనం

అల్లరితనం,అమాయకత్వం

మంచితనం,చిలిపితనం

కలబోసిన బాల్యం

షడ్రుచుల సమ్మేళనం

కానీ నెమరు వేసిన తెలిసేది ఒక్క తీయదనం


త్రిమూర్తులు బాలలై తరలివచ్చి తల్లి లాలిపాటలో పొందిన తన్మయత్వాన్ని

కౌసల్య కొసరి కొసరి తినిపించేవేళ నెలరాజు కోసం మారాము చేసిన రాముడి పెంకితనాన్ని

గోపి జన లోలుడు వెన్నను దొంగలిస్తూ గోపికలతో ఆడిన కొంటెపనులన్నీ

ఇది నా మాయ అంటూ దేవతల సైతం అలరారించిన బాల్యం

మనిషి జీవన దశలలో ఆనంద నిధి బృందావనం



అమ్మ జోలపాటే ఊయల ఊపిరని 

అల్లరితో మారాము చేసిన మందలించిన వైనాన్ని

అల్లంత దూరన ఉన్న చంద్రునితో ముద్ద తింటూ ముచ్చటించిన సాయంత్రాన్ని

అమ్మా చూడు అంటూ! నాన్న పై ఉప్పుమూట సవారి చేసిన కాలాన్ని

ఇలా నా ఊహ తెలియని వయసున చుట్టిన అల్లరి శ్రీకారం 

నాకు గుర్తు చేస్తూ అమ్మ అపుడపుడు ఆలపించే నా అల్లరి సంకీర్తనం


చక్కని చుక్కలాగున్నా మాకు మాత్రం నిండు చంద్రుడివంటూ బుగ్గన చుక్క పెట్టి మురిసిన మురిపాన్ని

నడకతో యుద్ధం చేసి తొలి అడుగుతో మోగించిన జయభేరిని

తొలిగా మాటల వింటిని వంచి మాటల శరాన్ని చేధించిన క్షణాన్ని

టా టా అంటే నీతో తంటాలంటూ తప్పించుకొని నా కనుగప్పిన కథలన్నీ

అరకొర జ్ఞాపకాలుగా నాలో నిలిచాయి

అమ్మ మాటల్లో అక్షర సత్యాలుగా మిగిలాయి



అ ఆ ల రాగాలు నేర్చుకొనేందుకు రోదన రాగాన్ని ఆలపించిన రోజుల్ని

కల్లబొల్లి కబుర్లతో పాఠశాలకు పంగనామం పెట్టిన కొంటెతనాన్ని

బలపాల కోసం నెచ్చెలి తో తగువు పెట్టుకున్న తరుణాన్ని

గీతాలన్నీ గానం చేస్తూ గిర గిరా ఇల్లంతా గిర్రున తిరిగిన రోజుల్ని

నా ముందు నిలబెట్టిన బాల్యాన్ని, ప్రశ్నించింది అందులోని అల్లరితనం

బదులుగా అది నా హక్కు అని చెప్పిన సమాధానానికి నవ్వుకుంది తుంటరితనం



వేసవిలో జాబిల్లిని చూస్తూ విన్న తాతయ్య చెప్పిన కథలన్నీ

ఆత్మీయులు పంచే అనుబంధాల అనురాగాలన్నీ

సోదరీ సోదరులతో కలిసి ఆడిన ఆటలన్నీ

తోటలో రుచి చూసిన పుల్లటి మామిళ్ళన్నీ 

ఎంత కాలమైనా నవనూతనం అనిపించే తియ్యదనం

ఎప్పటికి మరవని చిలిపితనం


వర్షం వెలిసిన వేళ నీటిపై వదిలిన కాగితపు పడవలన్నీ

ఏటిలో ఈత నేర్చుకొనేందుకు పడ్డ తంటాలన్నీ

ఏటిగట్టున ఇసుకతో చేసిన మేడలన్నీ

అప్పుడు సేకరించిన గవ్వలన్నీ

నా ముందు ఆనందంగా అలరారిన తరుణం

ఇప్పుడు మేడలు ఎన్ని ఉన్న ఆ ఆనందం లేని ఆభరణం


పాఠాలన్నీ వల్లెవేసి ఒప్పజప్పించుకున్న గురువుల్ని

పాఠశాల పక్కనే కొన్న చింతకాయల వాటాకై పడ్డ తగవులాటాలన్నీ 

పుస్తకాలలో నెమలీకలు దాచి వాటి పిల్లలకై అబ్రకం పెట్టి ఆశగా ఎదురుచూసిన చూపులన్నీ

బెత్తం దెబ్బలకి ఇదే రామబాణమని,తలలో సింగారించిన తుమ్మ ఆకులన్నీ 

తలపుకు వచ్చిన తరుణాన మేలుకున్న పెంకితనం

పెదవిపై చిరునవ్వులు రూవ్వున వెలిగిపోయే వదనం 


వీరి వీరి గుమ్మడిపండు అంటూ ఆడిన దాగుడు మూతలన్నీ 

రైలు బండి వచ్చిందంటూ ఒకరితో ఒకరు జత కట్టి తీసిన పరుగులన్నీ 

అచ్చమైన నవరత్నాలంటూ పదిలంగా దాచుకున్న అచ్చన్న రాళ్ళన్నీ 

బారా కట్ట ఆటలో నిండిన ఆరుబయట కట్టలన్నీ

కోతి కొమ్మచ్చి లో ఎక్కిన చెట్టుకొమ్మలన్నీ

గోళీల ఆటకై దాచిన గోళీల ఖజానాలన్నీ 

చెమ్మ చెక్కలంటూ వేసిన తప్పట్లన్నీ 

నా గుండె చప్పుడులో చప్పట్లు కొట్టిన సమయం

బాల్యం విలువ గుర్తుచేసుకొని వెల్లువాయే ఆనంద భాష్పాల జలపాతం


సంతోషం అంటే అర్థం తెలియదు కానీ

సంతోషం అనుభవిస్తూ సంతోషం పంచే అమృతం

కోపతాపాలు చిరుకాలమే కానీ చిరకాలం కాదని

తామరాకు మీద నీటి బొట్టులా భావొద్వేగాలను నిలిపిన వైనం

కుళ్లు కుతంత్రాలు ,రాగద్వేషాలు తెలియని 

మల్లెపువ్వులాంటి మనసుకు మలినం అంటనివ్వని బాల్యం

గిరిధరుడు గీతం చేసిన గీతా సారం తెలియదు కానీ,

సారాంశాన్ని సాదరంగా స్వీయం 

చేసుకున్న ప్రాయం

ఎదుగుదలయే శాపమై క్రమంగా తరిగిన పసిప్రాయం

రమ్మన్నా తిరిగి రాలేని మధుర ఘట్టం


పేద ధనిక తేడా చూడక కనపరిచే సమానత్వాన్ని

కులామతాలతో కించపరచక కలిసిపోయే సమైక్యత్వాన్ని

పాలు, నీళ్లు తేడా తెలియక చూసే లోకం తీరుని

కలబోసిన బాల్యం కల్లా కపటం ఎరుగని మంచితనం

తెలియకనే సమాజానికి చూపుతున్నది ఆదర్శ మార్గం


ఎన్నో ఆటలకు నిఘంటువుగా నిలిచిన ఆనాటి తరం బాల్యాన్ని 

ఈనాటి తరానికి దూరంగా వున్న సుందర కావ్యమని 

చరవాణితో చెలిమి చేస్తున్న చిన్నారులందరిని 

చరవాణి చెలిమి జట్టుకు చరమగీతం పాడమని 

ఆనాటి ఆటపాటలకు అందిద్దాం శుభారంభరాగం 

ఆరగించనిద్దాం ఈ బాలలను బాల్యపు మధుర ఫలం


మానసిక వికాసపు ఆట, పాటలతో ఎదిగే బాల్యం

వ్వక్తిత్వ వికాసానికి ప్రథమ పాదం 

భరతమాత భవిషత్తుకు పునాది బీజం


Rate this content
Log in

Similar telugu poem from Classics