STORYMIRROR

Swarnalatha yerraballa

Classics Inspirational Children

4  

Swarnalatha yerraballa

Classics Inspirational Children

అమ్మతత్వం

అమ్మతత్వం

1 min
259

నిన్ను నీవు ఎరుగకనే నీకై ఆరాటపడే హృదయం

నీరూపం లోకం ఎరుగకనే నిను ప్రేమించి మురిసే మురిపం

నీ తొలి రోదనం విన్నవెంటనే అక్కున చేర్చుకొని ఏబాధ నీ దరి చేరనీయని వైనం

వెలకట్టలేని ఋణం తీర్చలేని ప్రేమసాగరం

ప్రతిమనిషి బాధలో మనఃస్ఫూర్తిగా పెదవులు స్మరించే స్వరం

మన అమ్మ తత్వం ---- స్త్రీ జన్మ వరం


ఎక్కడో ఉన్నానంటూ నీ చెంత రాలేనంటూ

నీ సంరక్షణకై భగవంతుడు పంపిన భగవత్స్వరూపం


నీ తొలి అడుగులకు చప్పట్లు కొడుతూ

నీ తప్పటడుగులని తడబడకుండా సరిచేసే గురుతత్వం


నీ ముద్దు మాటలకు మురిసిపోతూ

నీ జీవితపు బాటలను స్ఫూరింపజేసే స్ఫూర్తి మంత్రం


మన అమ్మ తత్వం ----- ప్రత్యక్ష భగవత్స్వరూపం       


నీ ఆశల పొదరిల్లే తన జీవిత ధ్యేయమంటూ

తన ఆశల రెక్కలను నీకు తొడిగి ఎదుగుదలతో ఎగరమనే సహకారం


ఏ చిన్నపాటి దిగులుకైననూ గుబులు ఎందుకంటూ

తన ఒడిలోని ఓదార్పు వెలుగుతో దిగులుకి గుబులు పుట్టించి తరిమికొట్టే తీరం


ఈ జీవితాదారిలో నీ అడుగులకు తన అడుగులు జత చేరుస్తూ

నీ జీవిత గమ్యాన్ని చేరుటకు నీకు చేయుతనిచ్చే నేస్తం


మన అమ్మ తత్వం ----- నీ జీవిత మూల స్థంభం


Rate this content
Log in

Similar telugu poem from Classics