STORYMIRROR

Swarnalatha yerraballa

Classics Others Children

4  

Swarnalatha yerraballa

Classics Others Children

మది మధురాలయంఅంశం :గ్రంధాలయం

మది మధురాలయంఅంశం :గ్రంధాలయం

1 min
8


తెల్లవారుతున్న వెలుగులోని తొలికిరణంలా

నవజాత శిశువు లో చిగురించే విజ్ఞాన నిలయం

ఎంత నింపినా చోటుతరగని పుష్పక విమానం

మన మనసే ఒక గ్రంధాలయం

చదివిన నిను మహర్షిలా మార్చే మధురాలయం


అనుభవాల పాఠ్య పుస్తకాలతో

ఆదర్శమూర్తుల వ్వక్తిత్వ పాఠాలతో

మంచి చెడు గుణపాఠాల గుణింతాలతో

అల్లుకున్న అమూల్య మందిరం

నీ మనసనే మహా గ్రంధాలయం

నీ జీవితాన్ని తీర్చిదిద్దే మధురాలయం


ఎదురీతలో ఎదురయ్యే సవాళ్లుఎన్నెన్నో

సుడిగుండాలను తలపించే కన్నీటి కథలేన్నెన్నో

అడుగడుగునా నిన్ను అవరోధిస్తున్నా

నిరాశతో నిలిచిపోక మదిని చదువుకో

సమస్యను సుగమం చేసే సమాధానం నీవు పట్టుకో

సుమధుర జీవితానికి ఇదే మూలాధారం

ఈ జీవిత సాగరాన్ని సులువుగా దాటించే మనసే మధురాలయం



నిశ్శబ్ద సరస్సులో నీ శబ్ద తరంగాలను తెలుసుకో

ప్రతి హంసనూ హంసవాహినికి అర్పించుకో

అంతులేని విజ్ఞానాన్ని అంతర్లీనం చేసుకో

అనంతమైన జ్ఞానాన్ని ఆనందంగా పంచుకో

నీవు పంచిన ఆ మది పుస్తకం

చైతన్య పరిచే పరుల మస్తకం

ఎంత పంచినా తరగని మహా సాగరం మది గ్రంధాలయం

మరు జన్మకునూ ఈ జ్ఞాన పరిమళాన్ని ఇచ్చే మధురాలయం


Rate this content
Log in

Similar telugu poem from Classics