Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swarnalatha yerraballa

Drama Romance Others

4  

Swarnalatha yerraballa

Drama Romance Others

బాధ్యత శ్రీకారం

బాధ్యత శ్రీకారం

2 mins
338



లోక కళ్యాణానికి ఇది కళ్యాణ తిలకం

శాస్త్ర విహితమై హితమొనర్చు ధర్మ కార్యం

భగవంతుడు సృష్టి ఎదుగుదలకు విరచించిన ప్రణయ కవనం

ప్రకృతి పురుషుడి పరిణయ కావ్యం



అర్ధనారీశ్వరుల సంగమం

భార్యాభర్తలు సగం సగం అని చెప్పే ప్రతిరూపం

ఆదివిష్ణువు యద అది లక్ష్మి నివాసం

అది చెబుతుంది దంపతులు ఒకరి మదిలో ఒకరు ఉండాలి అన్న సత్యం

చతుర్ముఖుడు సరస్వతికి ఇచ్చిన ఆసనం

తెలియజేసేను ఒకరి మాటకు మరొకరు ఇవ్వవలసిన గౌరవం 



పచ్చని తోరణాల పందిరి ఆనందాల విరి వనం

పసుపు పారాణితో పచ్చటి జీవితానికి వేసే ప్రథమ పాదం

పసుపు కంకణాలతో మొదలయ్యే పెళ్లి సబరం

వధు వరుల యదలో మోగించింది సంతోషాల మేళం  

ఆ మేళ తాళానికి నాట్యం చేస్తూ మది ఎగిసే అంబరం

మది లయలు ఒక్కటి కానిచో అతః పాతాళానికి

చేరును బంధం

అంటూ వివాహ విలువను వార్ణిస్తున్నవి బాజా భజంత్రీల నాదం 


రెండు అక్షరాల పదం కాదు, రెండు కుటుంబాల స్నేహం సాగరం

రెండు జీవితాల ప్రగతి పథం

రెండు మనసులను ఒక్కటి చేసిన బంధం

రైలు పట్టాలలా జీవితాన్ని ఒకే గమ్యం కోసం సాగించే పయనం

ఈ పెళ్లి బంధం

రక్త సంబంధం లేకపోయినా సర్వసం తానై నిలిచిన బంధం

సాన్నిహిత్యమే శ్వాసగా నిలపమన్న బంధం

సందేహాల వాయుగుండం రేగినచో మరుగయ్యేను రెండు కుటుంబాల సంతోషం

పట్టాలు తప్పే రెండు జీవితాల మార్గం


మూడు మళ్ళ మాంగల్య బంధం

నమ్మకం, ప్రేమ, గౌరవం మూడుముళ్లుగా నిలిపిన బంధం

పసుపుతాడుతో స్వేచ్ఛను బంధించక స్వాతంత్ర్యపు రెక్కలను తొడిగి తోడై నిలిచిన నేస్తం

ఆశయ సాధనలో ఎదురయ్యే ఆటంకాల కంటకాలు

కలిగించే కష్టాల కన్నీటిని తుడిచి

నేనున్నా పదమంటూ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే బంధం

మూడుముళ్లను పదిలంగా దాచిన, మూతి ముడుపులు ఎన్ని ఉన్నా మాసిపోని బంధం


చిటికిన వేలుపట్టి చేసిన బాసల బాష్యం 

చివరివరకు నీకు అయ్యే కవచం

అది ఏ చీకటి దరిచేరేనీయనని చెప్పే ధైర్యం

చతుర్విధ పురుషార్థలలో వీడని బంధం

ధర్మబద్ధమైన జీవితానికి ఇచ్చే వెలుగుల హారం

కట్నాల ధన కార్చిచ్చులకు ఆహుతి కానివ్వక

నీ జీవితాన్ని ఎదురుకట్నంగా ఇచ్చి

తన నవ్వులతో పండించుకో నీ ఇంట సంతోష సిరి నిధుల కావ్యం 


నాతిచరామి అంటూ పలికిన పంచ అక్షరాలకు పంచభూతాలే సాక్ష్యం

ప్రాణం ఉన్నంత వరకు నీలో మిళితమై నీకు గుర్తుచేస్తున్నవి దాని సారాంశం

పాలు నీళ్లలా కలిసిన విడదీసిన విడిపోలేని అనుబంధం

విడాకులు అనే నాలుగు అక్షరాలతో విరక్కొట్టకు అని చెప్పే ప్రతీ క్షణం


అపురూపమైన దాంపత్య బంధం

మూడు పువ్వులు ఆరుకాయలుగా వికసించిన బంధం

అధిపథ్య ధోరణిని త్యజించి

నూతన తరాల రక్షణకై ఇవ్వాలి ఒకరికి ఒకరు సహకారం

అని చెప్పే జీలకర్ర బెల్లం చూర్ణ శిరోధారణం

వంశ వృక్ష రక్షణకు మూల కారణం


ఏడు అడుగుల పరిణయ బంధం

ఏడేడు జన్మల అనుబంధం

ప్రతి అడుగులోనూ నీవిస్తున్న హామీ పత్రం 

జీవితంలోనూ ప్రతి అడుగులోనూ తరగనివ్వకంది మమకారం

దాపరికం లేని దాంపత్యానికి ఇది నిదర్శనం 

అది దరి చేర్చేను ఏడు వర్ణాలు కలిసిన హరివిల్లుల అనురాగాల హారం

ఆ హారం ప్రతి నిత్యం నిత్య నూతన విరాజితం


జీవితం లో కాదిది ఒక భాగం

బ్రహచర్యానికి ఇస్తున్న వీడ్కోలు నీరాజనం 

జీవిత భాగస్వామికి పలికే స్వాగతం రాగం 

నూతన బాధ్యతాయుత జీవితానికి ఇదే ఆరంభ నాదం

ఈ పరిణయం విరబూసిన మమతల పరిమళం 


ప్రేమ మాత్రమే చాలు అనే సహజీవనం

అక్షింతల దీవెనలు దరిచేరని ప్రయాణం

ఆటంకాల వలలో క్షేణం అయ్యే ప్రేమతత్వం

ఏ హామీ లేని బంధానికి ఏనాడైనా పలికేను సమాప్తం

భావితరాలకు హితవు కాని ఈ సంబంధం

లోక బాంధవ్యపు బంధాలకు హానికరం


Rate this content
Log in

Similar telugu poem from Drama