Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swarnalatha yerraballa

Classics Inspirational Children

4  

Swarnalatha yerraballa

Classics Inspirational Children

విద్యాలయ ఓంకార నాదం

విద్యాలయ ఓంకార నాదం

1 min
378



గణ గణమని మోగే ఘంటారావం

పాఠశాలకు ఇది సుప్రభాతం

పిల్లల అందెలలో పద పదమనే పరుగులుగా

గురు శిష్యులకు సమయ దిక్సూచిగా

నిలిచిన ఘంటానాదం

విద్యాలయ ఓంకారనాదం


పాఠశాల సమయమునకు ఇది ప్రామాణికం

ఒకే కాలాన్ని శీఘ్రం, ఆలస్యం అంటూ చేసింది విభజనం

పాఠశాల ప్రవేశ ద్వారానికి కాపలాదారిగా

అలసత్వంతో ఆలస్యంగా వచ్చిన వారిని దండనకు అర్హులుగా

ద్వారం బయట నిలబెట్టి చేసింది తీర్మానం

అందుకే దాని ప్రతిధ్వనితో విద్యార్థుల హృదయ ధ్వనిలో చిగురించే భయనాదం


కాలపట్టిక సమయ పట్టాలు తప్పించని కాలమానం

అధ్యాపకుల సైతం అభ్యసింపజేస్తుంది సమయపాలనం

తరగతి సమయం సమాప్తమంటూ మోగించిన సమాప్తగీతం

మరో తరగతి నిర్వహణకు ఆదే ఆరంభరాగం

ఇలా పాఠశాల కాలపట్టీకి ప్రకటించింది పరిమిత సమయం

సమయాన్ని కేటాయించి సద్వినియోగానికి ఇచ్చింది నిర్వచనం

సమయనిర్వాహణే దీని ధ్యేయం


సాయంకాలం ఉచ్చరిస్తుంది శాంతిమంత్రం

పిల్లల ఆనందంతో కలిసి పాడుతుంది వీడ్కోలు రాగం

ప్రతి ఆదివారం అలసిపోయానంటూ

ఆరఅంగుళం కూడా కదలక ప్రశాంతతకు పట్టే బ్రహ్మరథం

సోమవారం నుంచి రెట్టింపు ఉత్సహంతో చేయును కర్తవ్య పాలనం

మరలా నీకు భోదించేను కాలసూత్ర ఆవశ్యకత్వం



పది రోజుల సెలవులకే మూగబోయిన మువ్వల నాదం

పడిగాపులుగాచే తరగతుల కిటకిట కోసం

మూగబోయిన ప్రాంగణం చూస్తూ

ఒంటరిగా ఉన్నా చలించక

సెలవుల అంతిమ రోజుకై కట్టింది ఎదురుచూపుల తోరణం

సెలవుల సంబరాలెన్నో చెప్పుకుంటూ తిరిగి వచ్చిన పాఠశాల గణమును చూసి  

మొదలెట్టింది గణ గణమంటూ మువ్వలనాదం



పరీక్షల సమయంలో దీని సహకారం అమోఘం

ప్రతీ అరగంటకు తరగిన సమయాన్ని తెలిపే సాయుధం

మిగిలిన కాలపు విలువను హెచ్చరిస్తూ

నీ చేతి వేగం పెంచుకోమంటూ

నీకు ఉత్తర్వు ఇచ్చిన సంకేతం

ఇది సంకేతమే కాదు పరీక్ష సమయాన్ని కొలిచే కొలమానం


వేసవిలో ఉసూరుమనే ఘంటానాదం

పిల్లలకోసం ఎదురుచూపులు చూసే ప్రతీక్షణం

ఏకాంతంలో తన ధ్వని కూడా మరిచి

ఏ ధ్వని దరిచేరని నిశ్శబ్ద నరకయాతన చూసి

పాఠశాల వసంతమునకై వేచిన కలకంఠం

వసంతం రాగానే చిన్నారుల ఆక్రందనలకు నవ్వుకొని ఎలుగెత్తింది కుహూల కంఠం


సమయపాలన క్రమశిక్షణను నేర్పించిన ఘంటానాదం

కాలం విలువను బోధించి దక్కించుకుంది గురుస్థానం

కాలం తిరిగితేలేని వజ్రం అని వివరించి

నీ భవిష్యత్తుకోసం పొందుపరచమంది ప్రణాళిక పీఠం

అది నీకు చూపించేను సఫలతా మార్గం

ఆ మార్గం నీజీవిత సాఫల్యానికి మూల కారణం


 ఇలా నీ జీవితంలో జీవిత జ్ఞాపకాలలో నిలిచిన ఘంటానాదం

సమయపాలనను నీ యదధ్వనిలో అంతర్లీనంచేసిన ప్రణవనాదం


Rate this content
Log in

Similar telugu poem from Classics