STORYMIRROR

Swarnalatha yerraballa

Abstract Inspirational Children

4  

Swarnalatha yerraballa

Abstract Inspirational Children

వివేకానంద - ఎవరివో నీవెవరివో

వివేకానంద - ఎవరివో నీవెవరివో

1 min
8


ఎవరివో నీవెవరివో


జ్ఞాన సాగరాన్ని పానం చేసిన జహ్ను మునివో 

జ్ఞానాన్ని విరజిమ్ముతున్న జ్ఞాన జ్యోతివో

జ్ఞాన వాహిని అక్కున చేర్చుకున్న ముద్దుబిడ్డవో

మా అజ్ఞాన తిమిరాన్ని అంతం చేసే తిమిరసంహరుడివో

తరగని విజ్ఞాన నిఘంటువుగా నిలిచిన వివేకుడవో


ఎవరివో నీవెవరివో


పరమహంస సహచర్యంలో పండిపోయిన మహర్షివో

పవిత్ర శిష్య సాధనతో అపవిత్రాన్ని దూరం చేసే గంగాఝరివో

గురు విలువను చాటి చెప్పి, గురు దూతగా నిలిచిన గ్రంధానివో

గురభోదలను అన్వయిస్తూ ఆ గురువుకే విలువను పెంచి మాకు గురువాయ్యావో


ఎవరివో నీవెవరివో


సుభాషితాల సూక్తుల ఉషస్సునిచ్చిన ఉషపుడివో

సూక్తుల స్ఫూర్తితో జీవితాన్ని బంగారు బాట చేసిన మార్గదర్శివో

కాశాయంతో యువత ఆశయాలకు అద్ధం పట్టిన ఆదర్శానివో 

దేశ కీర్తీ శంఖాన్ని దశదిశ ధ్వనింపజేసిన ధాత్రి ప్రియ తనయుడివో

ప్రియ భాషణతో అందరి యదలను జయంచిన అజేయుడవో


ఎవరివో నీవెవరివో


ఆత్మసాక్షాత్కారం పొందిన యోగివో

భోగా లాలస లేక నీలోనీవే రమిస్తున్న భోగివో

సుఖాలాన్నీ త్యజించిన త్యాగివో

బంధాలన్నీ తెంచుకున్న బైరాగివో

హిందూ ధర్మ ఔన్నత్యాన్ని చాటిన ధర్మ యోధుడివో

వేదాంత తత్వాన్ని ఆచరించిన సమతామూర్తివో


 ఎవరివో నీవెవరివో


Rate this content
Log in

Similar telugu poem from Abstract