"రామ - సీత - రామాయణం !"
"రామ - సీత - రామాయణం !"


పతి కోసం అంతఃపురం దాటి అడవులకేగిన సీతమ్మ...!
బంగారం లాంటి భర్త పక్కనుండగా ....
బంగారు లేడీ కోసం పరితపించడమేమిటో ?
పత్ని కోసం సంద్రాన్ని దాటి లంకకేగిన రామయ్య...!
చూడచక్కని భార్య చెంతచేరగా ...
పామరుడి మాట కోసం పరిత్యజించడమేమిటో ?
అందరి బంధువు ఆ రామయ్య అనుకోని కష్టాలకు,
పునీత పాపహీన ఆ సీతమ్మ కొనితెచ్చుకున్న కన్నీళ్లకు
సాక్ష్యమయ్యే పరమ పవిత్ర చరిత్రం
ఈ "సంపూర్ణ రామాయణం !"