"పవన - కవనం !"
"పవన - కవనం !"
సాయమే న్యాయమని నమ్మగా,
కష్టము కానుకై కలిసే !
సత్యము నిత్యము జపించగా,
వ్యథలే కథలై సాగే !
పలకరింపుకి ప్రయత్నించగా,
పరిచయములే పక్కకునెట్టే!
అదృష్టమనె లక్ష్యమై పరుగెత్తగా,
దురదృష్టమనె దారిని దరిచేరే!
అక్షరము పుస్తకమున పరచగా,
అర్థములే మరుగై పోయె!
నేర్పు, చేర్పులే నిరంతరములైనా,
నిట్టూర్పులే నీడలై నిలిచే!
నా కథలో కథానాయకుడైనా,
ప్రతీ కథలో ప్రతినాయకుడయ్యే !
మనసు -బరువుల మేఘమై కదలగా,
పదములు -కవితా వర్షమై కురిసే !
