STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

3  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

" ఆర్యన్!"

" ఆర్యన్!"

1 min
8






స్వామియే శరణం అయ్యప్పా — స్వామియే శరణం అయ్యప్పా
'అయ్యప్పా' అను నామంతో..
అనునిత్యం నిన్ను కొలిచేమయ్యా !

హరిహర కుమారా — కలియుగ వరదా
మణిహర మణికంఠా — విల్లాల వీరా
భూతప్రభు భూతనాథా — ధర్మదేవ ధర్మశాస్తా
పంబా వాసా — పందలరాజా
పరమ పూజితా — శరణాగత రక్షకా

'అయ్యప్ప' అను నామంతో...
అనునిత్యం నిన్ను కొలిచేమయ్యా !


తులసీ మాల ధారణతో — నియమాల తోరణంతో
మండల దీక్ష పూని — మనసే నీలో ముంచితిని 
నా భక్తి దీపం వెలగనీ — నీ దర్శన భాగ్యం కలగనీ
నా ముక్తి భావం పెరగనీ — నీ పాదసేవలో భాగమవనీ

'అయ్యప్పా' అను నామంతో...
అనునిత్యం నిన్ను కొలిచేమయ్యా !

తలపై ఇరుముడితో  — తనువంతా విబూదితో
పంబాలో స్నానమాడి — పావనుడనై వచ్చితిని
నీ నామం మహాధన్యం — నీ ధ్యానం మహాపుణ్యం
కైలాసం వైకుంఠం — శబరిగిరే నీ నివాసం

'అయ్యప్పా' అను నామంతో...
అనునిత్యం నిన్ను కొలిచేమయ్యా !

నీ భక్తుని వాంఛ ఆలకిస్తూ — నా పాపభారం భరిస్తూ
ఆపదలో నన్ను రక్షిస్తూ — నీ అండదండతో నిలిచేవు
శబరి కొండపై వెలిసేవు — నా గుండె నిండ వెలిగేవు
నువ్వే నా ప్రాణనాథుడు — నువ్వే నా లోకనాథుడు

'అయ్యప్పా' అను నామంతో...
అనునిత్యం నిన్ను కొలిచేమయ్యా !


సత్యధర్మ పరిపాలక — సద్గుణ సుప్రభాతం
ఆర్యన్ నీ రూపం — జ్యోతిర్మయ స్వరూపం
స్వామియే శరణమంటూ — నీ నామమృతం రుచి చూస్తా
జీవనాంతం నీకై జపిస్తూ — నీ సన్నిధిలోనే లీనమవుతా

'అయ్యప్పా' నీ నామంతో...
అనునిత్యం నిన్ను కొలిచేమయ్యా !

స్వామియే శరణం అయ్యప్పా — స్వామియే శరణం అయ్యప్పా
'అయ్యప్పా' అను నామంతో...
అనునిత్యం నిన్ను కొలిచేమయ్యా !



Rate this content
Log in

Similar telugu poem from Abstract