లక్ష్మి రావే మా ఇంటికి
లక్ష్మి రావే మా ఇంటికి
శ్రావణ మేఘాలు అలరించగా
చిరు జల్లులు వెంటరాగా
సిరులొలికే శ్రీ మహాలక్ష్మీ
శ్రావణ మహలక్ష్మీ రావే మా ఇంటికి
సకల శుభాలందించే సౌభాగ్యలక్ష్మీ
రావమ్మా ,వరాలిచ్చే వరలక్ష్మీ రావమ్మా
కాదంబరి పూల దర్శనాలు
చామంతి బంతి సోయగాలు
మామిడి తోరణాలంకారాలు
పసుపు కుంకుమతో గడపలు
స్వాగతం పలికేను తలపించేను
ప్రతి ఇల్లూ ఓ దేవాలయమై
శ్రావణ మాసమంతా
స్త్రీలందరూ భక్తి శ్రద్దలతో
పత్రం,పుష్పం,ఫలం,తోయంతో
ఆరాధించి ముత్తైయిదువులకు
వాయునములు ఇచ్చెదరు
ఇల్లంతా ధూప దీపాలతో
దేదిప్యం చేసెదరు
ఆనందాల పండుగే
సంతోషల సంబరమే
సౌభాగ్యాల పర్వమే
వైభోగమే ఈ శ్రావణం
శ్రావణ వైభవ విశిష్టతను
కధగా చదివినా వనితలకు
అష్ట సంపదలు కలిగేను
సిరులిచ్చే శ్రావణ మాసమంటే
ఇష్టపడని ముదితలెవ్వరు?
లక్ష్మీ రావే మా ఇంటికి,
మా ఇంట కల్ప తరువై,
కొలువుండవే మా ఇంట
స్థిరలక్ష్మివై