STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

3  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"సృష్టిలో తన ప్రేమ"

"సృష్టిలో తన ప్రేమ"

2 mins
178

ఆకాశ దేశాన వెలిసిన ఓ అరుదైన తార

అందుకోలేనంత దూరాన నీ నిలువెత్తు నీడ

వెన్నెల కురిపించే ఓ అందాల చంద్రమా

మబ్బుల మాటు దాగున్న ఓ కాంతి పుంజమా

అందుకే, నిన్నలా నానుండి దాచేసిన ఆ ఆకాశం నాకు విరోధి

పుడమిపై పురుడు పోసుకున్న నీ ప్రాణము

పట్టుకునెలోపు చేజారిన నీతో బంధము

ఐనా పట్టువిడవని నా విశ్వ ప్రయత్నము

ప్రకోపంతో పట్టుసడలని నీ పంతము

అందుకే, నిన్నలా నా నుండి దూరమా చేసిన ఆ పుడమి కూడా నాకు విరోధి

పిల్ల గాలులతో నా మదికి ఊపిరి పోసిన ఓ ప్రాణవాయువా

వడ గాల్పులతో నా యదని ఆపేసిన ఓ ప్రవాహమా?

నీ చల్లటి గాలులతో వెచ్చటి కౌగిలి ఏర్పరిచిన ఓ పవన ప్రభాతమా

ఉప్పెనవై ఎగిసిపడుతూ నన్నిలా ముసిరేసిన ఓ తుఫాను ప్రభంజనమా

అందుకే , నిన్నలా మార్చేసిన ఆ గాలంటే కూడా నాకు విరోధి

మేఘాల పల్లకి నుండి జాలువారిన ఓ చిరుజల్లుల పుష్పమా

అకస్మాత్తుగా ఎగిసిపడుతూ ఉప్పెనలా ఉగ్రరూపం దాల్చావు

నా కలల అలలా నా తీరపు గమ్యాన్ని చేరాల్సిన నువ్వు,

సంద్రపు కెరటంలా విరుచుకుపడి నా మనసును గాయపరిచావు

అందుకే, నిన్నలా నా నుండి వేరు చేసిన ఆ నీరు కూడా నాకు విరోధి

నీ పల్కుల మెల్కొల్పుతో నాకో సరికొత్త ఉదయాన్నిచ్చే ఓ వేకువ కిరణమా,

వెను వెంటనే నడినెత్తిన భానుడి ప్రభాతమై నన్ను దహించివేస్తావా?

దారిని చూపే నీ దీపపు కాంతి ప్రజ్వలిల్లాలని, దాని రక్షణకై నా రెండు హస్తములు అడ్డుపెడితే,

నీ వెలుగులు విరజిమ్మకుండా అది ఆపుతుందని పొరపాటు పడి నా కరములను కాల్చేస్తావా?

అందుకే, నికలా నన్ను భారం చేసిన ఆ నిప్పు కూడా నాకు విరోధి

ఈ పంచభూతాలే నా ప్రేమపై పంజా విసురుతుంటే,

ఆ పంచభూతాల్లోనే వింటున్న నీ అలజడుల సరిగమలు

ఈ ప్రకృతే నా ప్రేమపై పగబడుతూ అడ్డుగా నిలుస్తుంటే,

ఆ ప్రకృతి రమణీయతలో కంటున్న నీ రూపపు ఆకృతులు

వినిపించేనా నా పిలుపుల పదనిసలు నీ శ్రవనానికి

కనిపించేనా నీ వెలుగుల వేకువలు నా నాయనానికి

తెరిచివుంచనా నీ రాక కోసం నా మది తలుపులు

మ్రోగించనా నీ ప్రేమ కోసం నా యద సవ్వడులు

- సత్య పవన్✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract