దుర్గామ్మ
దుర్గామ్మ
కన్నులింట దుర్గమ్మను..దర్శించుట భాగ్యము..!
ఎల్లప్పుడు తనసేవన..మనసుండుట భాగ్యము..!
కణకణమది అద్భుతమగు..దేవళమే చూచిన..
కరుణామయి అమ్మశక్తి..తీపెరుగుట భాగ్యము..!
కష్టాలను రూపుమాపు..మౌనాక్షర రూపిణి..
మెఱుపుఖడ్గ ధారిణితో..ఏకమగుట భాగ్యము..!
కోటికోట్ల గగనాలను..ఏలుతున్న అంబిక..
పరమశివుని ఇల్లాలిని..మెప్పించుట భాగ్యము..!
జ్వాలాముఖి తాండవమే..విశ్వశాంతి కారిణి..
హైమవతీ లాస్యార్థము..తోడుకొనుట భాగ్యము..!
ఏ బంతులు చేమంతుల..మాలలేవి కోరదు..
విగ్రహాతీతమాత పథం..పట్టుకొనుట భాగ్యము..!
