వేణు గానం
వేణు గానం
నెమలి లా పురి విప్పింది
నా మది నీ వేణు గానం వినగా
హే అలలా పొంగింది మది
కృష్ణా నా మది అలలా కేరింత లు కొడుచున్నది నీ వేణు గానం వినగా
నీ వేణుగానం వింటూ శిలలా నిలిచాను
కాలం ఆగిందా ఓ కన్నా నీ మాయాజాలపు వేణు గానం తో
మురళీధర ఏమి చెప్పను
కనుల చివర ముత్యపు చుక్కలు విరిసే
కలువ రేకుల చెంపలు ఆ ముత్యాల జడిలో తడిచే
నీ వేణు గానపు మధురిమలో
ఆనందము భాష్పుములా కరిగే
కన్నె వయసు కరిగే వేళ లో
కన్నె సొగసు కలలో విహారింప
కన్హా నీ వేణుగానపు మధురిమలో
వసంత కాలపు చిగురులు తొడిగించే వర్షము
ఎడారిన సైతం వర్షించదా
కడలి అలలు కథాకళి ఆడేలా
వెన్నెల కురియదా
చిగురుటాకులను పులకింప చేసే రవి కిరణం లా
నన్నొకమారు కరుణింపచేయవా
ఏ భామలకు అందని అదృష్టం లా
నా పై వర్షింపవా
పార్ధుని ధర్మము దిశగా నడిపే వేళలో
నీ ధర్మము ఇటు చూచుట అవునో
ఇది తగునో కాదో తెలియదు
కృష్ణా....
నీ వేణువు చేసిన మధుర గాయం ఇది....