పుడమి
పుడమి
ఇద్దరు ఓరిమిన ఒకరి కొకరు తీసిపోరు....
ఒకరు ,భూ భారం వహిస్తారు...
మరొకరు గృహ భారం వహిస్తారు.!
ఈనాటి మహిళ ....భూదేవిని మించి
భారం వహిస్తుంది..!
..
కష్టాలు...కన్నీళ్లు ....తను దిగమింగుకుని....
చిరునవ్వు వెనుక, బాధలను కనబడనీయదు....!
బయట సమాజం తో సమస్యలు....
పని చేసే చోట సమస్యలు...
అమ్మతనాన్ని మంట కలుపుతున్న
మృగాళ్లు ఒకవైపు...
గుండెలో ఆరని మంటలు
ఎగిసి పడుతున్న....!
ఏదో చేయాలని ఆరాటం ఉన్న...
చేయలేని నిస్సహాయ స్థితి.....
చివరి కి ఈ కష్టాలన్నీ భరించలేక....
జానకీ మాత వలె, భూమిలో కలువక...
భూమాతనే, తను, ఎత్తుకొని
కష్టాలు లేని ప్రపంచాన్ని అన్వేషిస్తూ....
సాగిపోతున్న... క్షమామయి!
ఓ....భారత నారీ నీకు.......వందనం...
