STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

3  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

" నా కోసం ..! నా లేఖ ..!! "

" నా కోసం ..! నా లేఖ ..!! "

2 mins
10

ప్రియమైన నాకు,

ఎలా ఉన్నావ్ ?

బాగుంటావ్ లే..!

ఆకలి విలువ తెలియకుండా పెంచిన తల్లి,

కష్టం విలువ తెలియకుండా పెంచిన తండ్రి తోడుగా ఉన్నంత కాలం బాగోకుండా ఎలా ఉంటావ్ ?

అది నీ చిరునవ్వు చూస్తేనే తెలుస్తుంది !

లేక, ఇంత వయసొచ్చినా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నానన్న సిగ్గుతో ...

ఏమి చెయ్యలేని ఓ నిస్సహుయిడిలా ...

నీలో నువ్వే దిగులు పడుతూ, లోలోపల బాధ పడుతూ...

పైకి మాత్రం నలుగురితో నవ్వుతూ నటిస్తున్నావా?

ఎందుకీ నటన !

ఎప్పుడో జరిగినపోయిన చేదు గతం దగ్గరే ఆగిపోయావా ?

లేక, మళ్ళీ అలాంటిది పునరావృతం కాకుండా భవిషత్తు బాగుండాలని సరైన ప్రణాలికలు రచిస్తూ వర్తమానాన్ని వృధా చేస్తూ ఇక్కడే నిశ్చలంగా అలాగే కూర్చున్నావా ?

ఎందుకు, ఏదో సాధించాలని భీష్మించుకుని కూర్చుని నిన్ను నువ్వే కోల్పోతున్నావ్... ?

ఓహ్...!

నువ్వు బాగుంటే పలకరించి...

నువ్వు బాగోకుంటే పట్టించుకోని

ఈ సమాజం యొక్క మెప్పు కోసమా ?

అయినా ఏంట్రా ఆ పిచ్చి రాతలు.., పనికిమాలిన గీతలు .. ?

క్రికెట్ ఆటలు..., జిమ్ లో ఎక్సర్సైజులు...

నీ పనే బాగుంది రా... !

పైసా సంపాదన లేకపోయినా, ఖర్చుకి మాత్రం వెనుకాడడం లేదుగా.

ఓహ్...

ఇవన్నీ తమరికున్న ఒత్తిడిని తగ్గించే మార్గాలా !

అయినా ...

నీకెందుకా ఆవేశం, నీకెందుకా కోపం

ఏదో చెయ్యాలనుకుంటున్నావ్, ఏమీ చేయలేక ఆగిపోతున్నందుకా...

ఎంత కష్టం కూడగట్టినా, అదృష్టం అనేది కనికరించనందుకా ?

అయినా జీవితమంటే ఏదో సాధించడం కాదు, సాధించే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోకుండా జాగ్రత్త పడడం...!

ప్రపంచాన్ని గెలవాలనే నీ తాపత్రయంతో

ముందు నిన్ను నువ్వు గెలవడం మర్చిపోతున్నావ్... !!

గతం గురించి ఆలోచించి అలసిపోయింది చాలు కానీ,

ఇక వర్తమానంతో యుద్ధం మొదలుపెట్టు...

ఆ యుద్ధం గెలిస్తేనే భవిష్యత్తని గుర్తు పెట్టుకో !

గుర్తుంచుకో...

నీ కోసం ఎవరూ రారు...

నీకు ఎవరూ సహాయ పడరు...

నిన్ను వేలు పట్టుకుని నడిపించే రోజులూ లేవూ...

ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే పోరాడాలి, ఒంటరిగానే పోవాలి !

ఇకనైనా మారతావని ఆశిస్తూ ....

ఇట్లు...

నాలో నన్ను వెతికే నేను !

రచన :

సత్య పవన్



Rate this content
Log in

Similar telugu poem from Abstract