STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"నేనో నిత్యానేషిని !"

"నేనో నిత్యానేషిని !"

1 min
221

నేను...
కోరుకున్నది కదిలి రాక,
కావాలనుకున్నది కలిసి రాక,
భృతి కృత్యాలు వదిలి,
ఆసాంతం సత్యం అనుసరిస్తూ...
మధ్యంతరం లేని మార్గంలో
                       ఓ నిత్యాన్వేషిని !

నేను...
సొంతమనకున్న వాళ్లే
ఏకాంతాన్ని అలవాటు చేయగా...
పరుల కోసం విశ్రాంతి విడిచి,
ప్రశాంతత కోసం పరితపిస్తూ...
గత్యంతరం లేని గమనంలో
                      ఓ నిత్యాన్వేషిని !

నేను...
గమ్యం లేని దారుల్లో
గజిబిజిగా తడబడుతూ...
నిలకడ లేని నిర్ణయాలతో
నా కోసం నేను పయనిస్తూ...
నివ్వెరగా నిలబడితే, నీడే సహచరిగా
మౌనమే మార్గమై ముందుకు నడిచిన
                                   ఓ నిత్యాన్వేషిని !

నేను...
వెలుగుకంటే వేగమైన ఆలోచనలతో
చీకట్లను చేధించే కలలతో
శబ్దాన్ని భేదించే నిశబ్దంతో
ఏదైనా సాధించాలనే సంకల్పంతో
ఏదో కనుగొనాలనే తాపత్రయంతో
ప్రతీ ప్రశ్నను ప్రేమగా పలకరించే
                                 ఓ నిత్యాన్వేషిని !

నా మౌనంలో నే పలికిన సంభాషణ
నా పయనంలో నే వెతికిన పరమార్థం
నా తలపుల్లో నే నిర్మించుకున్న ఆశ్రమం
నా చూపుల్లో నే సృష్టించుకున్న బ్రహ్మాండం

అవును...

నేనో నిత్యాన్వేషినినే

   కానీ, ఇది నే రాసిన నా కథా ?

       కానే కాదు...

ఇది నా అంతరాత్మ అల్లిన ఆత్మగాధ !

      శ్వాస చివరి వరకూ...

             సాధనతో సాగే

                  ఓ అలుపెరగని యాత్ర !!

-mr.satya's_writings✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu poem from Abstract