మాధవి దీవెనం
మాధవి దీవెనం
చిలకమ్మ పూజే ఫలియించగా,
మాధవుడే చెర విడిపించగా,
గోరింక మనసే సంతోషంతో నిండగా,
మురిపాల మబ్బుల్లో తెలిపోయే
చిలక గోరింకలు లే.
తీయని మాటల సొగసే
వలపుగీతం పల్లవించగా,
గుండెలోని మధుర తలపు
నవ్వులై విరబూయగా,
చల్లనిగాలే సన్నాయి
మ్రోగించగా,
చిగురించిన ఆశలే మంగళతోరణాలవ్వగా,
మనసులోని మధువులే వేదమాంత్రాలై
చిలక గోరింకలను ఒకటిచేసెలే.
కలతలెరుగని ప్రేమలోగిలే దేవుడి కానుకే అవ్వగా,
మమతల మాలలే
లోకపు ముద్దుముచ్చటగా భాసిల్లగా,
తరిగిపోని ఆనందమే పచ్చనిసిరులుగా కనిపించగా,
గగనాన దేవుడే ప్రేమకుప్రతిరూపం మిమ్మే చేయగా,
వర్ధిల్లేరు మీరు ముచ్చటగొలిపే జంటగా.
