STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"తెలుసుకున్నాను...!"

"తెలుసుకున్నాను...!"

1 min
207

తెలుసుకున్నాను...
సూటిగా ఉంటే చులకనవుతామని !
నీతిగా ఉంటే లోకువవుతామని !
అనువుగా ఉంటే అలుసవుతామని !
పదునుగా ఉంటే ఎరుసవుతామని !

తెలుసుకున్నాను...
అవకాశాలు ఆదరించినా...
అదృష్టాలు వెక్కిరిస్తాయని !
ఆశయాలు కదిలించినా...
అవసరాలు అడ్డుకుంటాయని !

తెలుసుకున్నాను...
ఎదుగుతుంటే చప్పట్లు కరువని !
ఒరుగుతుంటే ఓదార్పు బరువుని !
సహిస్తే, సన్మానాలతో స్వాగతం సాధ్యమని !
తెగిస్తే, అవమానాలతో ముగింపు తథ్యమని !

తెలుసుకున్నాను...
సంప్రదాయాలు మరిచిన సంసారాలు...
సంపాదన వైపు పరుగుపెడుతున్నాయని !
జీవితంలో ఓ భాగమనుకున్న జీతం...
బ్రతుకునే పందెం కాసే ఓ జూదక్రీడని !

తెలుసుకున్నాను...
హద్దులతో ఆశలు ఆవిరై,
హక్కులకు అర్హతలు కరువై,
లెక్కలోకి రాని సుఖాలకి, లెక్కకు మించిన దుఃఖాలకు
టక్కున చెప్పే చిరునామా నే అయ్యానని !
ప్రపంచంలో ప్రయాణించాలన్నా, సమాజంలో సంచరించాలన్నా
చటుక్కున మారే మనసు నాదై ఉండాలని !

బాధలకు భావమే ఉంటే,
బాధ్యతలకు భాషే ఉంటే,
మనసును మలుపు తిప్పలేవా?
గెలుపనే తలుపును తట్టలేవా ?

బంధాలకు బలమే ఉంటే
బాధితుడికి అండే ఉంటే
ఈ పరిస్థితులకు పరిధి గీయలేవా ?
నా అక్షరాలకు అలుపు రాయలేవా ?


Rate this content
Log in

Similar telugu poem from Abstract