" జీవితం ఓ అందమైన నిర్మాణం !"
" జీవితం ఓ అందమైన నిర్మాణం !"


జీవితం..
ఓ అందమైన నిర్మాణం !
బాధలన్నీ బేస్మెంట్ పునాథుల్లో పూడ్చిపెట్టగా
కలలన్నీ కాలమ్ స్థంబాలుగా నిలబెట్టగా
బంధాలన్నీ బీమ్స్ దూలాల్లాగా ఏర్పరచగా
కష్టాలన్నీ కాంపౌండ్ వాల్ లోపల దాచిపెట్టగా
ప్రయత్నాలన్నీ ఫ్లోర్ నేల పైనే స్థిరపడగా
ఆశలన్నీ సీలింగ్ పైకప్పు వరకూ ఎగిసి"పడ"గా
ఇనుప ఊచల్లా ఒంగి ఒదగనా... ?
కాంక్రీట్ స్తంబాల్లా దృఢంగా నిలబడనా ?
రోజుకో మెట్టు ఎక్కుతూ...
ఎప్పటికీ చేరేనో జీవితపు ఇంటి పైకప్పు
కన్నీళ్లు తుడుచుకుంటూ...
రెపరెపలాడే కనుల కిటికీలు...
చిరు నవ్వులు చిందిస్తూ
ఆహ్వానం పలికే పెదవుల గుమ్మాలు..
ఆవేదనపు అంధకారంలో
అంతర్గత గదుల గోడల నిర్మాణం !
వెలుపల సహనపు
రంగులద్దగా బాహ్య ప్రపంచానికిదో ఇంద్ర భవనం !
నా ఈ జీవితం..
ఓ అరుదైన కట్టడం !
పైకి మాత్రమే కనిపించే
ఓ అందమైన నిర్మాణం !
Note:
A civil engineer's poetry
When his passion meets his profession
The result is ...🤷♂️
-mr.satya's_writings✍️✍️✍️