ఎందుకు పెళ్లెందుకు...?నీకెందుకు పెళ్లెందుకు...? "
ఎందుకు పెళ్లెందుకు...?నీకెందుకు పెళ్లెందుకు...? "


" ఎందుకు పెళ్లెందుకు...?
నీకెందుకు పెళ్లెందుకు...??
బ్రహ్మచర్యమే భాగ్యమవగా...
భాగస్వామికి భాగమేందుకు ?
బంధాలే వల పన్నగా
వలపులతో మలుపులెందుకు ?
ఎందుకు పెళ్లెందుకు...?
నీకెందుకు పెళ్లెందుకు...??
సావాసమే శత్రువవగా
సహచారిణితో సహకారమేల ?
సమాజమే విషం చిమ్మగా ..
సప్తపదికి తొందరేల?
ఎందుకు పెళ్లెందుకు...?
నీకెందుకు పెళ్లెందుకు...??
కట్నమడిగితే గాడిదాయే..
జాబుంటేనే పెళ్ళాయే !
ఆదర్శ వివాహం అలుసాయే ...
డాబుకొడితేనే అల్లుడాయే !
ఎందుకు పెళ్లెందుకు...?
నీకెందుకు పెళ్లెందుకు...??
మావిడాకులు, మంగళవాయిద్యాలె
నాటి పెళ్లికి పెద్దలాయే ...
విడాకులు, అమంగళపు చర్యలే
నేటి వైవాహిక జీవితంలో భాగమాయే !
మనసులు ముడిపడిన ప్రేమ బంధానికి
align-center"> పెళ్లి పందిరి కరువాయే ..
జాతకాలు జతకలిసిన పెళ్లి బంధానికి
ప్రేమ మందిరం బరువాయే !
ఎందుకు పెళ్లెందుకు...?
నీకెందుకు పెళ్లెందుకు...??
లేత వయసులో ఘాటు ప్రేమకు నో పర్మిషన్
లేటు వయసులో చాటు పెళ్లికి యమా టెన్షన్
కనీ పెంచిన వారికి తప్పని ఎమోషన్
కనిపించదు ఎవరికి మన అటెన్షన్
ఎందుకు పెళ్లెందుకు...?
నీకెందుకు పెళ్లెందుకు...??
బాధ్యతలకే బానిసవగా
భవిష్యత్తే ప్రశ్నార్థకమవగా...
కోటీ విద్యలు పెళ్లి కొరకైతే
సాహసమే చెయ్ రా డింభకా...!
అంటుందీ లోకం...!!
ఎందుకు పెళ్లెందుకు...?
నీకెందుకు పెళ్లెందుకు...?
వాంతులొచ్చే వంటలంట !
అడిగితే రగిలే మంటలంట !
అలిగితే తప్పని పెంటలంట !
అవసరమా ఇన్ని తంటాలు ఇంటంట ?
ఎందుకు పెళ్లెందుకు...?
నీకెందుకు పెళ్లెందుకు...? "
Written by
- satya pavan