STORYMIRROR

Midhun babu

Abstract Fantasy Others

4  

Midhun babu

Abstract Fantasy Others

అగ్నిదేహ

అగ్నిదేహ

1 min
208


ఆకాశంనిండా గోళాలే 

సూర్యగోళాలు లేకుంటే ...

ప్రాణానికి ఉనికి ఉంటుందా ? 

పదికాలాల పాటు

చల్లగా ఉండాలని దీవిస్తాం 

కాళ్లూచేతులు చల్లబడితే ? 

ప్రాణం నిలబడాలంటే .. ? 


అందరూ కర్మజీవులే 

కర్మకు మూలమైన శక్తి ఎవరు ?  

అన్ని ప్రాణుల కడుపున

భూమి కడుపున,సముద్రం కడుపున 

సమస్తవిశ్వం కడుపున దాగి ..... 

పాలించే శక్తి ఏది ?

అంధకారాన్ని చీల్చుతూ

చిరుదివ్వెలలోను - పాలపుంతలలోనూ

ఉన్నది ఎవరు ? - నీవేకదా ?


క్రతువులందు - పావకుడవని

హవిస్సును స్వీకరించి

సకలదేవతలకు అందించువాడవు 

ఇంద్రునికి చేదోడు,వాదోడు - నీవని

లేకుంటే వర్షాలే పడవని

సనాతనధర్మం పేరిట చెబుతున్నారు


మధ్యశిలాయుగంలో

నిన్ను కనుగొన్నామని

తద్వారా గొప్ప నాగరికతను

ఆవిష్కరించామని - ఆధునిక 

నాగరికతకు పునాదులు వేశామని

నేటి విజ్ఞానశాస్త్రం చెబుతుంది 




Rate this content
Log in

Similar telugu poem from Abstract