మహార్నవమి
మహార్నవమి
ఆయుధపూజ చేద్దాము
దుర్గామాతను కొలుద్దాము
విజయపథంలో నడుద్దాము.
దసరా పర్వదినమే
భక్తి పారవర్ష్యపు మెరుపుగా చెప్పుకుందాము.
విశ్వశక్తిమాత తలపే వీడకుందాము,
శ్వాసమాటున
నవరూపుల మాత తలపే దాచుకుందాము,
పరిమళ పుష్పరాగాలను
అవిశ్రాంత గుండెలయగా చేసుకుందాము,
కార్మిక కర్షక సకలజనుల
ఆవేదనలు తీర్చేటి భవానిమాతకు హృదిలోకోవెలనే కడదాము.
జగత్జనని కరుణతో
నరఅసురతను తరిమేద్దాము,
చంపదగిన శత్రువే భయమని
తెలుసుకుందాము
శక్తిస్వరూపిణి శరణుతో
నిర్భయంతో జీవిద్దాము,
బాధమాటు సుఖాలను తెలుసుకుందాము
విజ్ఞతనిచ్చు దేవికి
నిత్యారాధనం చేద్దాము,
జగములేలు తల్లి జగదీశ్వరికి
హృదినే అర్పణ చేద్దాము
అమ్మ మనసు ముచ్చటతోనే బ్రతుకు సాగిద్దాము,
ముక్తినిచ్చు మహాకార్యం ఇదేనని తెలుసుకుందాము.
