వెన్నపూస
వెన్నపూస
కృష్ణతత్వ సారమదే..సత్యమైన వెన్నపూస..!
గమనిస్తే మనసేనోయ్..స్వచ్ఛమైన వెన్నపూస..!
గగనాలను దాటగలుగు..జ్ఞానమేదొ పంచేనా..
ప్రేమమేఘ మాలలయే..రమ్యమైన వెన్నపూస..!
గుణదోషాలన్ని సరిగ..హరియించే ఓషధియే..
మట్టికుండ గుండెలోని..హృద్యమైన వెన్నపూస..!
పలుఊహల ఉట్టికొట్టు..ముచ్చటయే మనోహరం..
కర్మవీణ రాగాలకు..తైలమైన వెన్నపూస..!
బాలలైన..లేగలైన..జీవులలో ఉన్నదోయి..
అసలు చెలిమి క్రీడసాక్షి..మౌనమైన వెన్నపూస..!
మోహమెంత తుంటరిదో..బ్రతుకుపూల దారిలోన..
వెన్నుపూసలోన కదులు..వేదమైన వెన్నపూస..!
