STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"వేసవి సెలవుల్లో... చక్కని సాయంత్రం !"

"వేసవి సెలవుల్లో... చక్కని సాయంత్రం !"

1 min
310



" ఇంకా కనిపిస్తున్నాయా...?
వీధిగుమ్మంలో అమ్మ వేసిన కళ్ళాపి ముగ్గులు !
మళ్ళీ వినిపిస్తున్నాయా...?
ఆరుబయట మంచాలపై పెద్దోళ్ల ముచ్చట్లు !!

ఇంకా కనిపిస్తున్నాయా...?
నింగిలో మిళుకుమిళుకుమనే నక్షత్రాల వెలుగులు !
మళ్ళీ వినిపిస్తున్నాయా...?
హోరుగా వీస్తూ పిల్ల గాలులు చేసే అల్లర్ల శబ్దాలు !!

ఇంకా కనిపిస్తున్నాయా...?
ఆటకు రమ్మనే తోటివాళ్ళ ఎదురుచూపులు !
మళ్ళీ వినిపిస్తున్నాయా...?
ఆవకాయ అన్నం కోసం అమ్మ అరిచే అరుపులు !! "

" నేను గుర్తున్నానా నేస్తం...!
నువ్వు ఎంతగానో నచ్చే

"నీ ఏప్రిల్ 24 ని"

అదే, వేసవి సెలవుల్లో మొదటి రోజు సాయంత్రాన్ని..!

నువ్వు వదిలేసిన ఆ ప్రపంచాన్ని...
ఇలా సరదాగా మళ్లీ ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను !" అన్నట్టు
నన్నో రెండు పదుల వయసు వెనక్కు మళ్లిస్తూ ...
పలకరించింది ఈ సమయం ! "

ఆ సమయపు పలకరింపుకు
మౌనం సమాధానమైంది !

కారణం...
ఆ రోజుల్లో...
చేతికి సెల్ఫోన్ సంకెళ్లు లేవు...
భుజాలు బాధ్యతలకి బందీలు కావు...
సంపాదనకు బానిసలం కాము...
సంసారానికి బంధువులం కాము
కేవలం, కల్మషం లేని మనసులతో...
విషం చిమ్మని మనుషులం మాత్రమే !

ఈ ఇరవై ఏళ్లలో...
కాలంతో పాటు మనం ముందుకు కదిలామా?
లేక…
కాలమే మనల్ని మనకే తెలియకుండా
వేరొక ప్రపంచంలోకి నెట్టేసిందా?

అన్న సుదీర్ఘ ప్రశ్నకు
సమాధానం శూన్యమైంది !


-mr.satya's_writings✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu poem from Abstract