STORYMIRROR

Swarnalatha yerraballa

Inspirational Others Children

4  

Swarnalatha yerraballa

Inspirational Others Children

మార్గదర్శి

మార్గదర్శి

1 min
405


మట్టిలో రూపులేని ధూళిలా ఉన్న మాణిక్యమిది 

కుమ్మరి ప్రతిభతో రూపుకు ప్రాణం పోసుకున్న ప్రతిమ ఇది

నిప్పుల కొలిమిలో కాల్చిన నీరసించక ధీటుగా నిలిచే ధైర్యం నీది

నీవు కష్టపడ్డా నలుగురికి చల్లదనం పంచే చల్లటి హృదయం నీది

కష్టాలకు క్రుంగిపోక అంతకంతకు ఎదుగుతూ కర్తవ్య సాధన చేయమనే మార్గదర్శి ఇది



పేదవాడింట పసిడి పెన్నిధి

ఉన్నవాడింట ఆరోగ్య సూత్రనిధి

పేద ధనిక తేడా ఎరగని వైనం నీది

ఎవరింట అయినా మారని తీరు నీది

ఏ ఎండకు ఆ గొడుగు పట్టకని చెప్పే గుణపాఠం నీది



నిండుగా నిగారిస్తున్నపుడు ఒడిదుడుకులకు తావులేదంది

సగం మాత్రమే నింపితే తొణికిసలాటకు సై అంటానంది

జ్ఞానాన్ని నిండుగా నింపుకొనేవాడు తడబడడన్న తత్వం దీనిది

అజ్ఞానంతో ఉన్నవాడు తొందర పాటులో నిలకడ లేనివాడనే వాక్యం నీది

నిండుకుండ తొణకదు అనే సామెతతో సమాజానికి ఇచ్చిన స్వరం నీది


బుజ్జి బుజ్జి బుజ్జాయిల బొమ్మరింటిలో బుల్లి భూమిక పోషించింది 

బుడి బుడి చేతులలో లేని విందులు వడ్డించింది

 ఆట పాటల అల్లరితో తను అల్లుకపోయింది

 ముద్దుమాటలన్నీ మూటగట్టి తనలో దాచుకుంది

చిన్ననాటి జ్ఞాపకలలో చెరగని మహారాణి అయింది 





వన్నె మోముల వెన్నెల గోపన్న కోసం వెన్నె దాచింది

దాచిన వెన్నెను కంటపడనీక దోబూచులాడింది

గాంధారి గార్భాన్ని గుట్టుగా దాచింది 

నూతన సంతాన వైద్య విధానమునకు ఆనాడే చేయూత నిచ్చింది

యుగ యుగాలుగా మానవ జీవితంలో ప్రత్యేకత నిలుపుకుంది


దైవారాధనలో దేదీప్యమానమైన దీప స్థానం దీనిది

పరమాత్మకు పరమాన్నములు తినిపించింది

పరమ పదము చేరుటకు పవిత్ర ఉపదేశాలెన్నో తెలుసుకుంది

శరణంటూ వచ్చిన భక్తుల చేతిలో ప్రసాదాలెన్నో పెట్టింది

ప్రతిఫలంగా ప్రసన్నతతో ఆత్మ ఫలమును నివేదించమంది 



కాటికి వెళ్లే సమయాన కూడా నీతో కడదాక నడుస్తుంది

నిప్పుల కుంపటి మోస్తూ సత్యాలెన్నో చెబుతుంది

దహన సంస్కారలకు శంఖారావం మొగిస్తూ పునాది బీజం వేస్తుంది

త్రి రాంధ్రాలకు సంకేతంగా త్రిగుణాలను విడిచి త్రిమూర్తి చింతన చేయమంది

పంచాభూతాలలో నీవు కలిసే సమయంలో వేదాంతం వల్లిస్తుంది



చిల్లులెన్నిపడ్డా చతికిల పడనంది

పగిలి ముక్కలయ్యేదాకా పరోపకారం చేస్తానంటుంది

ముక్కలైననూ మట్టిలో కలిసి మొలకలందిస్తానంది

అంతమైననూ వేరొక జీవితాన్ని నిలబెట్టాలని తపిస్తుంది

అంతమైనా అవయవదానంతో ఎందరికో జీవితాన్ని ఇవ్వచ్చని ఆనందంగా చాటి చెప్పింది


మట్టికుండ కాదు ఇది

మార్గదర్శి ఇది


Rate this content
Log in

Similar telugu poem from Inspirational