STORYMIRROR

Swarnalatha yerraballa

Abstract Tragedy Others

4  

Swarnalatha yerraballa

Abstract Tragedy Others

గమ్యం

గమ్యం

1 min
356


నేను ఎవరు అని ప్రశ్నించుకో

నీవు ఎవరు అనే జవాబు తెలుసుకో

ప్రశ్న,జవాబ ఒక్కటైన ప్రయాణం

గమ్యం తెలియని ఓ పయనం

అది గమ్యం చేర్చే ప్రయాణం



అర్థం కానిది వేదాంతం

అర్థం అయితే పరమార్థం

అనుభవిస్తున్న ప్రతిక్షణం మాయా జగం

మోహంతో కమ్మేసే మాయాజాలం 

అంతుచిక్కని నిత్య సత్యం

అది తెలుసుకొనే ప్రయాణం ----- నీ గమ్యం

గమ్యం కాదది జవాబుల పత్రం


ఏ తోడు లేక రావాడం

తోడుకై పరితపించిపోవడం

సంబంధ బాంధవ్యాల సమాహారం 

అనుబంధాలు నింపుకున్న జీవితం

బాధల బంధిఖానాలో బంధీ అవ్వడం 

అని తెలుసుకొనే ప్రయాణం -----నీ గమ్యం

అది తెంచే బవబంధాల మిథ్యా హారం



ఖాళీ చేతులతో ఏడుస్తూ పుట్టడం

కాసులు ప్రొగేసుకొని నవ్వుతూ బ్రతకడం

కాణీ కూడా చేతిలో లేక కట్టె ఖాళీచేసి గిట్టడం

నీ సొంతం చేసే ఆరడుగుల స్థలం

అనుభవించాలనుకుంటే అది శూన్యం

అది తెలుసుకొనే ప్రయాణం ----నీ గమ్యం

అది చేర్చే నీ గమ్యస్థానం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract