సెంటిమెంట్స్ ఆన్ సేల్
సెంటిమెంట్స్ ఆన్ సేల్
ఈ మహ నగరాలలో ప్రేమను
చౌకగా పంచబడును,తుంచబడును, పెంచబడును
మీ సెంటిమెంట్స్ ను
ఏపుడైన, ఎక్కడైనా కొనబడును, అమ్మబడును
ఇక్కడ ఏడుపులు, నవ్వులు, పెడబోబ్బులు
మార్కెట్లో అగ్గువకే దొరుకుతాయి
ఒడుగు, పొడుగు ఉన్న వ్యక్తులను
పార్ట్ టైమ్ సేవలకు వినియోగించుకోవచ్చును
అమ్మ, నాన్నలను కీరాయికి ఇవ్వబడును
అద్దెకు భార్యలను, భర్తలను
సరసమైన ధరకే విక్రయించబడును
లవర్స్ ను పార్కులో గంటకే
మార్చుకునే సదుపాయం కలదు
ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్రేమల కోసం
మా నూతన షో రూమ్స్ ని సంప్రదించండి
చిరునవ్వులు ప్రదర్శించడానికి
బర్తడే ఫంక్షన్స్ కి బుక్ చేసుకుంటే
డెత్ డే ఫంక్షన్ లో ఏడవటానికి డిస్కౌంట్ ఇవ్వబడును
మ్యారేజ్ స్లాట్కి అడ్వాన్స్ కట్టెతే
విడాకుల మహోత్సవం ఫ్రీగా సెలబ్రేట్ చేయబడును
ఇంకా ఒంటరి మనసుకి ఓదార్పు కోసం
ఆన్లైన్ సేవలు మీకు అందుబాటులో
ఉంచడమే మా ప్రత్యేకత
డ్యూటీ టైంలో విరామం కోసం
అతి తక్కువ ధరకు అందమైన
అమ్మాయిలతో మరియు అబ్బాయిలతో చాటింగ్
చేసుకొనే సదవకాశాన్ని వినియోగించుకోండి
మా ప్ర
తి షో రూమ్ నందు
ఒక ముద్దు కొంటె మరో ముద్దు ఫ్రీ
మంచి తరుణం మించిన దొరకదు
రండి లాగిన్ అవ్వండి.........!
మీ సిగ్గును మరియు సిగ్గు బిళ్ళను తొలగిస్తే
మీ ఆదాయం క్షణాలల్లో రూపాయిలు ...
నిమిషాలల్లో వందలు......
అర గంటలో వేయ్యిలు....
గంటలో లక్షలు ......
సంపాదించుకొనే అతిపెద్ద
ప్రపంచ నీలిచిత్రాల స్టాక్ మార్కెట్
మా మహానగరం ప్రత్యేకత
పగలైన రాత్రైన ఎపుడైనా సరే
అందాల ఆరబోత లైవ్ క్యామ్ షో లు
వర్చువల్ రియాలిటీ షో,
సెమి న్యూడ్, న్యూడ్, బాత్రూమ్ షో
బెడ్రూమ్ షో లకు, పర్మిట్ రూమ్ కలదు
ప్రతి ఎపిసోడ్ కి సాటిస్ ఫ్యాక్షన్ గ్యారంటీ
కస్టమర్ భద్రతే మాకు ముఖ్యం
టర్మ్స్ అండ్ పాలసీ ఒకే చేయండి
చట్ట భద్రత మా న్యాయ నిపుణులు అందిస్తారు
ఇట్లు
మహానగరాలలో మనిషి
గ్లోబల్ ఆర్గనైజేషన్
100జీ కాలనీ