నేనిలా...
నేనిలా...
నువ్వు లేని..నేను
మూగబోయిన డప్పు లా
కాళ్ళకి తొడగని చెప్పు లా
ఆవు మేయని గొప్పు లా
వంట చేయని నిప్పు లా
జడకి వేయని క్లిప్ లా
హాండిల్ లేని గ్రిప్ లా
బ్యాగ్ కి వేయని జిప్ లా
నువ్వు లేని నేనిలా
పూజకు నోచని పువ్వు లా
పంజరాన ఉన్న గువ్వ లా
అన్నార్ధులకు అందని బువ్వ లా
గజ్జెకు కట్టని మువ్వ లా
వెలుగు లేని నవ్వు లా..
నువ్వు లేని..నేనిలా
......రాజ్....

