సరదాగా కాసేపు
సరదాగా కాసేపు
కదిలే బొమ్మలు అండి కదిలే బొమ్మలు
చిన్నా పెద్దా తేడా లేదు...
అందరిని కాసేపు నవ్విస్తుంది.
చిన్నా పెద్దా తేడా లేదు....
అందరిని కాసేపు ఏడిపిస్తుంది.
చిన్నాపెద్దా తేడా లేదు....
అందరితో కాసేపు భావాలెన్నో
పలికిస్తుంది.
వెండితెర నవ్వులు పూయించి
ఆలోచనలు రేపుతుంది.
మంచికి మంచి, చెడుకి చెడు...
ఎందరి తలరాతలో మార్చిన సినిమా
ఎందరినో కీర్తి శిఖరాన నిలిపిన సినిమా.
అలసిన సగటు మానవుడి జీవితాన
సరదాగా కాసేపు సేద తీరుస్తుంది.
కదిలే బొమ్మలు అండి....
మామూలు మనుషులను సైతం
కోట్ల హృదయాలలో చెరగని స్థానం
రంజింపిన సినిమా
ప్రతిరోజూ పండుగ
చేసిన సినిమా మాయ.
