నీవు - నేను
నీవు - నేను
కనురెప్పలు విశ్రాంతి కోసం
ఆవలిస్తున్న వేళ...
ఒంటరిగా ఉండమని
జ్ఞాపకాలు శాసిస్తున్న వేళ....
నీ పలకరింపు నా హృదయ వీణను
మీటింది...
ముగావోయిన నామనసును
తట్టిలేపింది....
నీ స్పర్శ అంతరించిన...
నా ఆత్మీయతను వెలికి తీసింది...
తెలియని అనుభూతి
నన్ను అలలా తాకింది...
నీ చేయూత నాలో
ఆశలు రేపింది...
కలలాంటి జీవితాన్ని వాస్తవానికి
దరి చేరింది...
నీ తోడు నాకున్నది అన్న భావన
ఎంతో బాగుంది...
నా కవితలకు అదే ప్రేరణగా
నిలిచింది...
అలా మొదలైంది....
నా కవితా ఝరీ...
ఇలా సాగిపోతుంటే
నా చెంతన నీవు లేవు ఈ వేళ!!!
