రామచంద్రుడు
రామచంద్రుడు
శివుని భక్తిగ పూజ చేసిన పుణ్య పురుషుడె రామ చంద్రుడు..!
రావణాసుర తత్వమణచిన మాన్య చరితుడె రామ చంద్రుడు..!
శివుడు హనుమగ రామ సేవను సలిపె ప్రియముగ కనగ వశమే..!?
ఎల్ల జనులకు మేలు చేసిన విమల రూపుడె రామ చంద్రుడు..!
లేని బంగరు లేడినడిగిన లేమ సీతకు ముదము గూర్చెనె..!
మోహమర్మము తెలియజెప్పిన కమల నయనుడె రామ చంద్రుడు..!
తండ్రి మాటకు కట్టుబడెనే తనయు విధినే జగతి తెలియగ..!
రాజ్యభోగము విస్మరించిన అమృత చరణుడె రామ చంద్రుడు..!
మాటలెంతగ కొరత పడునో మాత సీతా గుణము పొగడగ..!
మౌన సుందరి మనసు గెలిచిన మందహాసుడె రామ చంద్రుడు..!