పరమపదం సోపానం
పరమపదం సోపానం
నను వదలి వెళ్ళిపోయిన చిరునవ్వులు
నీ ప్రేమ వలయంలో చిక్కుకున్నాయి
వలస వెళ్లిన పక్షుల వలె...
మదిలోని తలపులు వలస వెళ్లాయి నీకోసం...
నిన్ను కలసివస్తాయో లేక తీసుకువస్తాయో...
ఈ గూటికి...
ఎన్ని గడియలు గడచిపోయాయో...
ఎన్ని రోజులు గడచిపోయాయో...
ఆ తలపులు వెళ్లి...
ఆ నా తలపులు నిను చేరాయా...
నీ పాద పద్మముల చెంతకు చేరువయ్యాయా?
నా హృదయ స్పందనలు వింటున్నానే గాని...
నీ కోసం ప్రతిస్పందించే హృదయాన్ని వింటున్నావా?
శ్వాస తీసుకుంటున్నానే గాని...
శ్వాస లో నిండి ఉన్న నీవు కానరావేమి?
అశాశ్వతమైనవన్నీ చుట్టూ చేర్చి...
మధ్యలో నిలబెట్టి... చోద్యం చూస్తుండిపోయావేమి?
బంధాలను సంకెళ్లుగా మార్చి...
చుట్టూ వలయాన్ని కట్టేశావేమి?
ప్రశ్నలు నాలో... భక్తి నాలో...
కానీ...
నా తలపులు ఎటు వెళ్ళాయో నిను వెతుకుటకు...
ఆ తలపులకు తిరిగి వచ్చే దారి తెలియదేమో?
నన్ను చేరకున్నాయి...
ఇదేమిటయ్యా / ఇదేమిటమ్మా...
మనసున నిలపినా ...కొలచినా ...
ఉలుకు లేదు... పలుకు లేదు...
ఇలా ఉంటే... నా తలపుల దారి ఎటు?
ఒక్కసారి నా తలపుల వేడుకోలు కు బదులియ్యరాదా...
ఒకే ఒక్కసారి నీ మాటలు నన్ను చేరనియ్యవా...
శ్రవణానందమును పొందెదను ,
ఒకే ఒక్కసారి నీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించవా...
నయనానందమును చెంది,
పరమపద సోపానాన్ని రెండు చేతుల్తోను కౌగిలించుకుంటాను..
