STORYMIRROR

Midhun babu

Abstract Classics Fantasy

4  

Midhun babu

Abstract Classics Fantasy

ఉగాది

ఉగాది

1 min
3


'క్రోధి'కెంత అనురాగమొ..పలుకవచ్చె కోకిలమే..! 

కోపమెంత అవసరమో..తెలుపవచ్చె కోకిలమే..! 


పురస్కార మేదైనా..ఎవరికైన ఇవ్వవచ్చు.. 

కవికోకిల బిరుదుగుట్టు..విప్పవచ్చె కోకిలమే..! 


ఓటెవరికి వేస్తేనేం..అన్యాయం న్యాయమేగ..

రాజకీయ చైతన్యం..నింపవచ్చె కోకిలమే..! 


అధికారం ఎవరిదైన..సామాన్యుల కెవరు దిక్కు.. 

ప్రశ్నించే దమ్మెంతో..ఇవ్వవచ్చె కోకిలమే..! 


ఏ రాముడు రక్షించునొ..మరి రావణ బాధితులను..

ప్రతిమహిళకు ఆత్మశక్తి..పెంచవచ్చె కోకిలమే..! 


తనకోపమె తనమిత్రుడు..ఎఱుకన్నది తోడైతే.. 

కాలుష్యపు పొరలు తెఱలు..చెండవచ్చె కోకిలమే..! 


Rate this content
Log in

Similar telugu poem from Abstract