నా మనసే నీ పూజ
నా మనసే నీ పూజ
నా మనసే నీ పూజా..కుసుమంలా అర్పింతును..!
నీ చూపుల పరిమళమే..నా పాటగ భావింతును..!
భాషలన్ని మూగబోవు..చోటంటే నీ సన్నిధి..
అక్షరాల నీ తలపుల..వనసీమన జీవింతును..!
ఉగాదితో మోడులన్ని..చిగురించే ముచ్చటలో..
విమలభక్తి ఫలములనే..నా పదముల పండింతును..!
శ్రీ సీతా కల్యాణమె..శుభప్రదమీ లోకానికి..
శాంతిరామ మంత్రమునే..కానుకగా చదివింతును..!
రైతన్నల వెన్నుదన్ను..నిలచు ప్రభుత కావాలోయ్..
మట్టిగుండె జెండానై..నింగిదాక వ్యాపింతును..!
కులమేదో మతమేదో..ఎవరి గుండెగంట పలుకు..
మానవతా శంఖమొత్తి..హెచ్చరికై నినదింతును..!