ప్రతి శ్లోకం
ప్రతి శ్లోకం
ప్రతి హృదయం సమాధిలా..కనిపిస్తూ ఉన్నది..!
ప్రతి శోకం శ్లోకంలా..ఉదయిస్తూ ఉన్నది..!
నాకలం గళం విప్పినట్లు తెలిసింది ఇపుడు..
సరికొత్త విప్లవమేదో..సృష్టిస్తూ ఉన్నది..!
నీకోసం నేనున్నా..అనేమనిషి ఏడోయ్..!?
నా మౌనం వెతుకులాట..సాగిస్తూ ఉన్నది..!
కర్తవ్యం బోధించే..సూర్యుడెవరు భువిలో..!?
నా శ్వాసల వీధికూడ..ప్రశ్నిస్తూ ఉన్నది..!
అక్షరాల పాదధూళి..నింపుకున్న గగనం..
కాగితమను వేదికపై..నర్తిస్తూ ఉన్నది..!
ఊహ ఎవరి సొత్తంటే..మట్టి కులికిపాటే..
రాయికూడ రాగాలను..ఒలికిస్తూ ఉన్నది..!
