ఆలయం
ఆలయం
చూసితివో హృదియెహనుమ..దివ్యమైన ఆలయం..!
జగతిలోని ప్రతికణమో..అందమైన ఆలయం..!
రామునికై వెతుకులాట..ముగిసినంత మోక్షము..
నిశ్చలమగు మనసేలే..నిత్యమైన ఆలయం..!
తనదులోని శివుని తెలిసి..చూసుకో ఓ రామా..
ఈ తనువే అయోధ్యలా..భాగ్యమైన ఆలయం..!
అంతరంగ లోకాలను..చుట్టిరాగ తోడేది..
భ్రూస్థానమె పరమాత్మకు..నిలయమైన ఆలయం..!
భద్రాచల మెక్కడంటె..పరుగుతీయు పనేమిటి..
శబరిప్రేమ తత్వమదే..స్వచ్ఛమైన ఆలయం..!
తనసహనమె సీతమయని..గుర్తించిన చాలులే..
జనకమహారాజ మదియె..శాంతమైన ఆలయం..!
