STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

4  

Midhun babu

Abstract Classics Others

దైవమోయి

దైవమోయి

1 min
2


సూర్యులకే శక్తినింపు..మూలసాక్షి దైవమోయి..!

కాంతిపూల సీమలేలు..శ్వాససాక్షి దైవమోయి..!


కాంచగల్గు కన్నులింటి..జగదాధార అక్షరమే..

కణకణమున నాట్యమాడు..దీపసాక్షి దైవమోయి..!


సర్వాంతర్యామి తాను..మాటలకే లొంగేనా.. 

శుభ్రమనో గగనోపరి..గగనసాక్షి దైవమోయి..!


సుస్వరాల ధారలొలుకు..హంసవీణ కందేనా..

గుండెలయల జన్మకథల..కావ్యసాక్షి దైవమోయి..!


బంధాలకు గంధాలకు..అతీతమై కదిలేనా..

వర్షించే నవ్వుపూల..మౌనసాక్షి దైవమోయి..!


జగములనే నడిపించే..ధర్మమర్మ విభూతియే..

ప్రవహించే స్నేహనదుల..ప్రేమసాక్షి దైవమోయి..!


Rate this content
Log in

Similar telugu poem from Abstract