STORYMIRROR

Midhun babu

Abstract Romance Fantasy

4  

Midhun babu

Abstract Romance Fantasy

కల్యాణం

కల్యాణం

1 min
3


నీలోపలి రామునితో..కలిసుండుట కల్యాణం..! 

మనస్సనే సీతమ్మను..లాలించుట కల్యాణం..! 


వాత్సల్యము ఎంతున్నా..రాగబంధమే మోహం.. 

సుజ్ఞానపు ఎఱుకలోన..జీవించుట కల్యాణం..! 


జన్మతోటి సౌమ్యతనే..పుణికిపుచ్చుకున్నదెవరు.. 

రామునిలా సమానతను..వర్షించుట కల్యాణం..! 


శివధనుస్సు ఉందెక్కడ..విరిచేందుకు ఓ రామా.. 

"నేను-నాది" స్పష్టముగా..విడనాడుట కల్యాణం..! 


ఎవరి జాతకాన్ని వారు..మార్చుకునే వీలున్నది.. 

శాంతిపూర్ణ వివేకమున..చరియించుట కల్యాణం..! 


పరమశివుడు హనుమంతుడు..ఆరాముని దాసుడాయె.. 

నామరూప రాహిత్యము..సాధించుట కల్యాణం..! 



Rate this content
Log in

Similar telugu poem from Abstract