హీతవరీ
హీతవరీ
నీ పలుకుల మధుధారన..తడవనిమ్ము హితవరీ..!
నా గొప్పను నీ గొప్పగ..చాటనిమ్ము హితవరీ..!
బీజమేదొ చూడలేక..నేను మొక్క నిక్కునే..
సత్యముతో ఎఱుకలోన..ఉండనిమ్ము హితవరీ..!
నాదేమియు లేదన్నది..రుజువైనది చూడనే..
నా లోపలి నిన్ను సరిగ..కూడనిమ్ము హితవరీ..!
ఆటలెన్ని ఆడితినో..ఎంత మోసమయినదో..
ఈ మనస్సు దోబూచులు..ఆగనిమ్ము హితవరీ..!
రుచులవెంట పరుగుతీయు..గుణమెలాగ రాలునో..
కన్నులింటి యజ్ఞవాటి..వేయనిమ్ము హితవరీ..!
కరిగిపోని తరిగిపోని..సౌందర్యము మరేదట..
నీ మంగళ జ్యోతినలా..గాంచనిమ్ము హితవరీ..!
