అనుబంధం
అనుబంధం
తండ్రివాక్యమే శిరోధార్యముగ..జీవించడమే అనుబంధం..!
ఇష్టాయిష్టము లన్నీచక్కగ..వదిలేయడమే అనుబంధం..!
సింహాసనములు రాజ్యసంపదలు..సుఖభోగాలే అధికములా..
కుటుంబగౌరవ రక్షణార్థమై..ఒగ్గేయడమే అనుబంధం..!
ప్రజాసేవయే మహాభాగ్యమని..తలచేవారే ప్రభువులందు..
స్వార్థసుఖముకై అర్రులుచాచక..పనిచేయడమే అనుబంధం..!
పుడమికిగగనం దూరంఎంతో..సాక్షీతత్వం ప్రేమకదా..
అనురాగాలను ఆప్యాయతలను..కాపాడడమే అనుబంధం..!
పొలమునువిభునకు దున్నుట నేర్పెను..భూమిజచూడగ సత్యములే..
కలిసినచూపుల కల్యాణమునే..దీవించడమే అనుబంధం..!
అన్నిప్రాణులను సమభావముతో..చూసేతత్వమె దైవత్వం..
సేవకజనులకు ప్రేమాదరములు..పంచేయడమే అనుబంధం..!
