మందు.. ముక్క.. పచ్చ నోట్ల చిట్టా..
మందు.. ముక్క.. పచ్చ నోట్ల చిట్టా..
వందేళ్ళకు దగ్గరవుతున్న ప్రజాస్వామ్య దేశం
ఇప్పటికీ అర్థం కాని పేదరిక శాతం
ప్రజాస్వామ్యంలో పండుగంటూ
ఊదరగొట్టేసే ఓ బ్యాచ్
మందు,ముక్క ఇచ్చి కాకా పట్టే మరో బ్యాచ్
నోటి కాడ కూడును లాక్కొని
ఎన్ని ఎదవ పనులు చేసినా
అవన్నీ మర్చిపోయేలా
పచ్చ నోట్లు చల్లి
తామే ఆదుకుంటామనే బ్యాచ్ మరో వైపు
చీరలు
బిందెలు
బండ్లు
ఇలా ఎన్నో ఇస్తారు
కానీ
సగటు మనిషి కష్టం తీర్చే వాడెవ్వడు
మద్యపానమే దేశాన్ని అభివృద్ధి చేస్తోంది
అని ఓ వైపు రచ్చ చేస్తోంటే
హానికరమని చెప్పడం హాస్యాస్పదం అయిపోతుందేమో
విచ్చలవిడిగా మత్తుకు బానిసయ్యే యువత ఉంటే
ఇక దేశానికి దిశా నిర్దేశం చేసేదెవ్వరు
ఏ మహానుభావుడో భారతీయత అంటూ పూనుకున్నా
వెంట నడిచేదెవ్వరు
ఓ ఓటరూ
జరంత చూస్కొని మీట నొక్కు
లేదంటే
మల్ల మొత్తం నీ పీక నొక్కుతరే
