STORYMIRROR

T. s.

Abstract Classics Others

4  

T. s.

Abstract Classics Others

మనసున పూసిన భావం

మనసున పూసిన భావం

1 min
8

వెదురు గుండె తొలచి వేణువుని చేసినట్టు

నా గుండె నిండుగా పూసిన అక్షరాల చెట్టు పూలని

రాల్చి వాగ్దేవికి చేసింది పదాల పూల అర్చన.


నా కవితై

పద పుష్పాల వనంలో  

వేలాది అక్షరాలు పదాల పువ్వులై

పూస్తుంటాయి

కలం నుండి జాలువారి కవితలై

చిగురిస్తుంటాయి

భావాలు పద పరిమళాలుగా విరిసి

గుభాలిస్తుంటాయి

సహజ సుందరంగా 

నా కలంలో ఒదిగి పోతుంటాయి


కలలు కావు

ఊహలు కావు

కవితలు రాయాలనే తలపులో

ఒక్క క్షణంలో పుట్టిన భావాలు

అవి నా గుండె తొలిచి కవితగా రూపొందిన చిత్రాలు.



साहित्याला गुण द्या
लॉग इन

Similar telugu poem from Abstract