STORYMIRROR

Midhun babu

Abstract

4  

Midhun babu

Abstract

మంత్రంలా

మంత్రంలా

1 min
5


దొరికెనులే నీ పేరే..తలచదగిన మంత్రంలా..! 

అందెనులే మైమరపే..పాడదగిన గీతంలా..! 


వింతమాయ గాకేమిటి..ఈ కాలం ఆగెనేల.. 

చిక్కెనులే నీ రూపం..చెక్కదగిన శిల్పంలా..! 


రాళ్ళెలాగ మాట్లాడునొ..తెలుసుకోగ మనసాయెను.. 

పొంగెనులే మౌనమేదొ..వ్రాయదగిన కావ్యంలా..! 


అల్లుకున్న మాటలతో..యాతనలే ఓ చెలియా.. 

కురిసెనులే నీనవ్వులె..చూడదగిన వర్షంలా..! 


ప్రేమలోన పడిలేచే..కెరటమొకటి ఎదుటపడెను.. 

చుట్టెనులే ఈమనసును..కోయదగిన ఖడ్గంలా..! 


మోయలేని మోహమేల..తాళలేని తాపమేల.. 

తెలిపెనులే తెలుపకనే..రాల్చదగిన రాగంలా..!


Rate this content
Log in

Similar telugu poem from Abstract