రామచరిత
రామచరిత
ఆదర్శం అపురూపం..ఈ జాతికి రామచరిత..!
ధ్యానభక్తి లోతు తెల్పు..ఈ మనిషికి రామచరిత..!
ఆంజనేయ స్వామి రోమరోమమేల పలికె రామ..
గుండె చీల్చి రాముజూపె..యోగానికి రామచరిత..!
పక్షులతో జంతువులతొ..సైన్యమేల ఏర్పరచెను..
విశ్వమైత్రి చాటినదే..ఈ జగతికి రామచరిత..!
తలిదండ్రుల క్షేమముకై..రాజ్యభోగమే విడిచెను..
అమ్మసీత ప్రేమకథా..పతిభక్తికి రామచరిత..!
ఒక బంగరు లేడిఎలా..ఉండగలదు గమనిస్తే..
ఆంతర్యం సీతకెరుక..యుద్ధానికి రామచరిత..!
రావణునకు ఎంత ఎఱుక..ఎవరికెరుక లోకంలో..
కోరి మరణమాశించెను..జ్ఞానానికి రామచరిత..!
