MATHS
MATHS
లెక్కలు..లెక్కలు!
లెక్కలు లెక్కలు లెక్కలు..
కితాబంతా ఒకటే ..చిక్కులు
Student కి మొదలంట ..తిప్పలు..
ఒక లెక్కలోనేమో ..
మొత్తమెంత అంటాడు
మా సారేమో..
కూడండి..అంటాడు!
మరో లెక్కలో..
బేధమెంత అంటాడు
మాష్టారేమో ..
తీసేయ్ రా అంటాడు!
మరో దాంట్లో..
పంచండి అంటాడు
మా పంతులయ్యో మో..
భాగహారం చెయ్యండి అంటాడు!
ఇంకో లెక్కలో..
రెట్టింపు చెయ్యు అంటాడు
మా సారేమో ..
2 తో గుణించు అంటాడు!
<
br>
మరో దాంట్లో..
పొడవెంతో కనుక్కోండి అంటాడు
మా సారేమో..ఎక్స్ ..అనుకోండి అంటాడు!
దేవుడా!
ఏంది రా ఈ లెక్కలు అనుకునేవేమో!
లెక్కలంటే..
చిక్కులు కాదు..
లాజిక్ లు..మ్యాజిక్ లు
లెక్కలంటే..
ఒక తమాషా!
ఒక ఆశ్చర్యం!
ఒక అద్భుతం!
అని తెలిసుకుంటే..
కిక్కులే..కిక్కులు!
ఏంతైనా ..
లెక్కలుంటే...
ఆ కిక్కే ...వేరప్పా!
.....రాజ్.....