ప్రే'మసూచి'క
ప్రే'మసూచి'క
ప్రే 'మ సూచి' క
....................
కన్నులను నిద్ర ఆవహించటంలేదు
నాన్నమాటలు వినిపించటంలేదు
అమ్మవంటలు రుచించటం లేదు
పాఠాలు మెదడులో కెక్కటంలేదు
పాటలు చెవిలో దూరటం లేదు
మసూచో?
కరోనో?
మరేదో?
కొత్తదేదో
మెదడురోగం
సోకిందేమో అనుకున్నా.....
ఇపుడే నిజం తెలుసుకున్నా
"ప్రేయసీ ఇదే ప్రేమసూచిక"
పుట్టింది నిన్ను చూచినంతనే
చైనా సంతలో కరోనాలా
నేనే మజ్నూ నీవే లైలా
కలిసిబ్రతుకుదాం కలకాలం
శానిటైజర్ మాస్కు తోడుగా
లాక్ డౌన్ లో తోడుజోడిగా
గాదిరాజు మధుసూదన రాజు