అందానికి అందం (prompt 30)
అందానికి అందం (prompt 30)


అందంగా ముద్దొచ్చే వనిత వదనారవిందం
ముత్యాల వలె మెరిసే చక్కని దంతపక్తి ద్వయం
దొండపండ్ల మెరుపుతో నిండిన పెదాలు గల ఇంతి
నిడుపైన ముక్కును దాచిన గుండ్రని ఊలు బంతి
ఆనందం గానో, ఆశ్చర్యం తోనో విప్పారిన నేత్రాలు
ఏ సందేశం, ఎవరికి ఇవ్వనున్నవో ఆమె కనులు