నా పేరు మిడిల్ క్లాస్ జీవితం..
నా పేరు మిడిల్ క్లాస్ జీవితం..


నా స్వగతానికి స్వాగతం..
నా పేరు మిడిల్ క్లాస్ జీవితం..
పిప్పిప్పైన ట్యూబ్ లోంచి పేష్ట్ తీసేంత శక్తి నాది..
పాత సబ్బుని కొత్త సబ్బుకి అతికించి మన్నిక పెంచే యుక్తి నాది ..
పైకి బ్రాండెడ్ బట్టలు, బూట్లు, రిచ్చి జీవనశైలి..
లొపల టిఫిన్ చేయని ఆకలి,లంచికై బెంగ,
ఎందుకంటే పర్సు మొత్తం ఖాలి ఖాలి..
అదృష్టం కోసం ఆశగా ఎదురు చూస్తు..
కష్టం వస్తే కంగారు పడకుండా వాయిద వేస్తు..
కార్ల ఊహల్లో తేలుకుంటు,కాలి నడకను శపిస్తు..
కాష్ట్లీ జీవితాన్ని కలగంటు, ఉన్నదాన్ని ఈసడించుకుంటు..
బతికే బంగారు బతుకు నాది..!
డాబుకి ఉన్న డబ్బుని ఖర్చు పేట్టి ..
నిత్యావసరాలకి అప్పు చేసె ఆదర్శ జీవిని..!
ధనవంతుడు ఎదురుపడితే డబ్బున్న బలుపంటు..
కూలోడు ఎదిగితె నడిమంత్రపు సిరి అంటు..
ప్రపంచం మీద ఫిర్యాదులు చెసేవాన్నీ నేనే..
జీవితం గురించి సూక్తులు చేప్పెదీ నేనే..
పెళ్ళి వయసుకి వచ్చిన కూతురిని, నలభై కిలొల భారమంటు..
పెళ్ళీడుకి వచ్చిన కొడుకుని, అరవై తులాల లాభమంటూ..
ప్రపంచానికి ప్రేమ యొక్క కోలామానం నేర్పిన..
ఆధునిక అధ్యపకున్ని..!
ఇదంతా కూడా హాస్యంగా వ్యంగ్యంగా ఉన్న..
పౌరుషాలకు పోరాటాలకు నేను పెట్టింది పేరు..
నా ఫిర్యాదుల స్వభావం..
ఉద్యమాన్ని నాకు తోబుట్టువుని చేసింధి..
తప్పు సూక్ష్మంగా ఉన్న, కనిపెట్టె తెలివినిచ్చింది..!
ధనవంతుల మీద కుల్లు, ఆత్మగౌరవంతో పాటు..
అప్పుడప్పుడు పేదోడికి సాయం చేసె సుగుణాన్నిచ్చింది..
యెదగాలనే కసి ఇంకా ఉంది..
సాధించడానికి ఇది సరిపోదా??!